అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా (Team India) ధీటుగా బదులిస్తోంది
ఆస్ట్రేలియా చేసిన 480 పరుగుల తొలి ఇన్నింగ్స్ కు.. టీమిండియా కూడా అదిరిపోయే రిప్లే ఇస్తుంది.
పిచ్ లో టర్న్ ఉన్నా భారత బ్యాటర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు.
రెండో రోజు ఆటలో శుబ్ మన్ గిల్ సెంచరీతో కదం తొక్కాడు.
ఈ ఏడాది గిల్ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది వన్డేల్లో మూడు..
సూపర్ ఫామ్ లో ఉన్నా.. కేఎల్ రాహుల్ కారణంగా శుబ్ మన్ గిల్ కు తొలి రెండు టెస్టుల్లో స్థానం లభించలేదు
ఇక రాహుల్ తొలి రెండు టెస్టుల్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు
దాంతో మూడో టెస్టుకు రాహుల్ ను తప్పించి.. అతడి స్థానంలో గిల్ కు చోటు ఇచ్చారు.
అయితే గిల్ మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయాడు.
దాంతో గిల్ పై కూడా విమర్శలు వచ్చాయి.
అయితే వీటికి గిల్ నాలుగో టెస్టుతో సమాధానం చెప్పాడు. సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
గిల్ సెంచరీతో కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్ ఇప్పుడు డేంజర్ లో పడిందనే చెప్పాలి.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఓపెనర్ గా రాహుల్ కు అవకాశం లభించడం దాదాపుగా అసాధ్యం.
టెస్టుతో పాటు వన్డే, టి20ల్లో కూడా రాహుల్ కు ఓపెనర్ గా అవకాశం దక్కేది అనుమానమే.
రిషభ్ పంత్ లేకపోవడంతో వికెట్ కీపర్ రూపంలో రాహుల్ వన్డేల్లో ఆడుతున్నాడు.
వచ్చే రెండు మూడు నెలల్లో రాహుల్ వన్డేల్లో కూడా విఫలం అయితే అతడు టీమిండియాకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
కేఎల్ రాహుల్ గత కొంత కాలంగా జిడ్డు బ్యాటింగ్ తోపాటు పరుగులు చేయడంలో పూర్తిగా విఫలం అవుతున్నాడు
దాంతో అతడిని టీమిండియా నుంచి తప్పించాలంటూ అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.